జాతియం

Modi: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తాం

Modi: అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను.. స్వదేశానికి తీసుకొస్తామని వైట్‌హౌస్ వేదికగా ప్రకటించారు మోదీ. మానవ అక్రమ రవాణాను.. అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందన్నారు మోదీ. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి.. అక్కడ నివసించే హక్కు ఉండదని.. ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు మోదీ. ఇక అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని.. ఇటీవల 104 మంది భారతీయులను వెనక్కి పంపింది అమెరికా. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ స్పందించారు.

భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు ట్రంప్‌. చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడని చెప్పారు ట్రంప్. తమ స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా తమకు ఆయిల్‌, గ్యాస్‌ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే తాము ఎవర్నీ ఓడించాలను కోవట్లేదన్నారు ట్రంప్. మంచి చేయాలని చూస్తున్నామన్నారు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేస్తానన్న ట్రంప్.. అమెరికాలో గత పాలన తమకు అంతరాయం కలిగించిందన్నారు.

వైట్‌‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. 140 కోట్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారన్నారు మోదీ. మరో 4 ఏళ్లు ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్న మోదీ.. భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్‌ కృషి చేయడం చాలా సంతోషమన్నారు. ట్రంప్‌లాగే తాను భారత్‌ ప్రయోజనాలు కాపా డటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. తాము రెట్టింపు వేగంతో పని చేస్తామన్నారు మోదీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button