News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీతి ఆయోగ్ సభ్యురాలు

తిరుమల శ్రీవారిని నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరం అనియ దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న ఆమె.. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె అన్నారు. భక్తులకు చక్కటి సౌకర్యాలు కల్పిస్తున్న టీటీడీ అధికారులను, సిబ్బందిని అభినందించారు.



