ఆంధ్ర ప్రదేశ్సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక

తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న సందడి చేశారు. వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ సినీ తారలు.. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.



