జాతియం
చెన్నైలో ఉదయనిధి అరెస్ట్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయనిధి అరెస్ట్‌తో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి.



