ఆంధ్ర ప్రదేశ్
ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు, పలు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ బస్సుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.



