News
నేడు ముంబై వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ ముంబైకు వెళ్లనున్నారు. సుప్రియాసూలే కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. రేపు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో సీఎం రేవంత్ ఉన్నారు. సోమవారం కేంద్ర ఆర్థికశాఖమంత్రి, అధికారులతో భేటీ కానున్నారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడి పెంచే పనిలో సీఎం ఉన్నారు. రుణం ఇవ్వకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది.



