తమిళనాడులో రాష్ట్ర గీతం వివాదం

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్ర గీతం “తమిళ్ తాయ్ వాళ్తు” ఆలాపనపై సీఎం విజయ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నుంచే మొదలైన ఈ వివాదం తాజాగా మంత్రివర్గ విస్తరణ సమయంలో మరింత ముదిరింది. వందేమాతరం తర్వాత తమిళ్ తాయ్ వాళ్తు ఆలపించడంపై భాగస్వామ్య పార్టీలైన వీసీకే, లెఫ్ట్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2021లో డీఎంకే ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించిన తమిళ్ తాయ్ వాళ్తును.. కార్యక్రమం ప్రారంభంలోనే తప్పనిసరిగా ఆలపించాలన్న నిబంధన ఉందని గుర్తుచేస్తున్నారు. మరోవైపు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసే వేళ జాతీయ గీతం, వందేమాతరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఇంకో వర్గం వాదిస్తోంది. అసలు ఇది ప్రోటోకాల్ వివాదమా..? లేక తమిళ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ వ్యూహమా..? అన్న చర్చ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.



