పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం

పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు. ప్రాజెక్టు పనులు, ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. దానికి సంబంధించి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ఆయా రాష్ట్రాల్లో ముంపు ప్రభావంపై చర్చ జరగనుంది. ఆయా రాష్ట్రాలతో సమన్వయం అంశాలపై చర్చ జరగనుంది. ప్రాజెక్టును 45.72 మీటర్లతో 194.6 టీఎంసీల పూర్తి సామర్ధ్యంతో నిర్మాణంపై నిర్దేశం చేయనున్నారు. తదుపరి కార్యాచరణను జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నిర్దేశించనున్నారు. రెండోదశ భూసేకరణ పునరావాస ప్యాకేజీ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇవాళ భేటీకి ఏపీ సీఎస్, జలవనరుల శాఖ సలహాదారు హాజరుకానున్నారు.



