ఆంధ్ర ప్రదేశ్

ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు.. విశాఖ నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నడికుడి బయలుదేరారు. జనరల్‌ బోగీలో బాత్‌రూం వద్ద కూర్చుని ప్రయాణం చేస్తుండగా.. ఏసీ బోగీలో బాయ్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శౌరవ్‌ బగ్ది.. దంపతులిద్దరినీ ఏసీ బోగీలో కూర్చోవచ్చని పిలిచాడు.

ఇద్దరూ వెళ్లిన తర్వాత భర్త ఫోన్‌ చూసుకుంటూ బాత్‌రూం వద్దే నిల్చోగా భార్య లోపలకు వెళ్లారు. ఇదే అదనుగా యువకుడు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చాక భార్య ముభావంగా ఉండటం చూసి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పారు. దీంతో రెంటచింతల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. విజయవాడ రైల్వే పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడిని గుర్తించిన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button