తెలంగాణ
Pocharam: ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు

రేవంత్ సర్కార్ పనితీరుపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? అని ప్రశ్నించారు.
నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. సిద్దాపూర్ రిజర్వాయర్ దగ్గర పోచారం శ్రీనివాస రెడ్డి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని ధ్వజమెత్తారు.



