తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారు లో యాత్రికులతో వస్తున్న బస్సు బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పటాన్ చెరువు కు చెందిన యాత్రికులు ప్రైవేట్ స్కూల్ బస్సులో వస్తుండగా బడా పహాడ్ అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. గాయపడిన వారిని నిజామాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.



