తెలంగాణ
Revanth Reddy: త్వరలో శాస్త్రీయంగా జిల్లాల విభజన

Revanth Reddy: కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్లు రేవంత్ తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కల్పించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమని రేవంత్ అన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.



