ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారు

Chandrababu: చిట్‌చాట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చాలా నగరాలు రివర్ ఫ్రంట్‌లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. మిగులు జలాలు వాడుకోవడం తప్పు ఎలా అవుతుందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పిన జగన్ రాజధానిపై విషం చిమ్ముుతున్నారని అన్నారు.



