ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్

తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. క్యూలైన్‌కు వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటూ భద్రత సిబ్బంది ముందే నానా హంగామా చేశాడు. నేనే దేవున్ని శపిస్తా అంటు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు అధికారులు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.



