తెలంగాణ
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. మద్యం తాగి.. బిర్యానీ తిన్న 16 మందికి అస్వస్థత.. ఒకరి మృతి

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి రాత్రి వేడుకలు చేసుకున్నారు. మద్యం తాగి, బిర్యానీ తిన్నారు. అనంతరం 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మరణించగా 16 మంది ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం నారాక్ష్ణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.



