తెలంగాణ
Nandyala: ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

Nandyala: నంద్యాల జిల్లా తొడుములదిన్నెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో తండ్రి సురేంద్ర పిల్లలను చంపాడు. చిన్నారులు కావ్య, ధ్యానేశ్వరి, సూర్యగగన్ మృతి చెందారు. ఏడాది క్రితం సురేంద్ర భార్య మహేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



