ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాంప్రసాద్ రెడ్డి

ఏపీ మంత్రివర్గ సమావేశంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై, సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్టు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్టు సమాచారం.



