ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 81,348 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 26,150 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా టీటీడీ వెల్లడించింది.



