ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించారు. రజనీకాంత్ దంపతులు 72 కిల్లోల చక్కెర,బెల్లం,కలకండ,బియ్యం,చిల్లర నాణేలతో రజనీకాంత్ 82 కిల్లోలతో లతా రజనీకాంత్ స్వామి వారికీ మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం హుండీలో‌ కానుకలు సమర్పించిన రజనీకాంత్ దంపతులకు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. రజనీకాంత్ వెంట కుమార్తెలు,మనవళ్ళు వున్నారు. రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button