Allu Arjun: యాడ్ షూట్లో బన్నీ.. వీడియో వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థమ్సప్ కొత్త అడ్వర్టైజ్మెంట్ షూటింగ్లో స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. స్ట్రాంగ్, స్టైలిష్, ఐకానిక్ అల్లు అర్జున్ అని షూట్ ఫొటోస్ చూస్తే అర్థమవుతోంది. ఈ యాడ్ విడుదల అయితే మరింత సందడి చేస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పుష్ప ఫీవర్ ఇంకా తగ్గని సమయంలోనే అల్లు అర్జున్ మరో బ్రాండ్ యాడ్‌తో అభిమానులను అలరించాడు. పాపులర్ కోల్డ్ డ్రింక్ థమ్సప్ కొత్త ప్రకటన షూటింగ్లో స్టైలిష్ అవతార్‌లో కనిపించిన బన్నీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్‌తో పూర్తి బ్లాక్ లుక్‌లో స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ ఒక్కసారిగా స్క్రీన్‌ను ఆక్రమించేశాడు. ఈ షూట్ ఫొటోస్ చూసిన అభిమానులు “స్ట్రాంగ్, స్టైలిష్, అన్మిస్టేకబుల్ ఐకానిక్ బన్నీ” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ యాడ్ ఎప్పుడు రీలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.



