తెలంగాణ
నేడు తెలంగాణ వ్యాప్తంగా విజయ్ దివస్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేయనున్నారు.
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి.. తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని.. నిమ్స్ ఆస్పత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు.



