తెలంగాణ

Srinivas Goud: విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ నిరసన

Srinivas Goud: గ్లోబల్ సమ్మిట్, పుట్ బాల్, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10వేల కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ నిరసన తెలిపారు.

పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిన మంత్రులకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బకాయి ఫీజులు చెల్లించకుండా వివక్ష చూపుతుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button