తెలంగాణ
మంత్రి పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన కొందరు వ్యక్తులు వట్టినాగులపల్లిలోని తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి గోశాలను ధ్వంసం చేశారని పల్లివి షా అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో గోశాల షెడ్లను కూల్చివేశారని బాధితురాలు తెలిపింది. నవంబర్ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశరు. మరోవైపు తమ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు.



