తెలంగాణ
Telangana: రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబు అమర్చారు. అయితే దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో రైల్వే స్టేషన్‌లో జనం పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో డాగ్స్ స్క్వాడ్‌లతో పరిశీలిస్తున్నారు.



