జాతియం
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 15 పనిదినాలు మాత్రమే ఉండనున్నాయి, సాధారణంగా ఇవి 20 రోజులు ఉండే ప్రసక్తిలో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)తో పాటు, ఇటీవల హఠాత్తుగా ప్రవేశపెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు, ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన, రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం, అణు ఇంధన రంగం ప్రైవేటీకరణ, రైతులకు కనీస మద్దతు ధర, అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న ఉన్నత విద్యా కమిషన్ వంటి అంశాలపై అధికార బీజేపీని నిలదీయడానికి విపక్షాలు పూర్తిగా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు తీవ్ర వాదోపవాదాలతో వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



