తెలంగాణ
నికత్ జరీన్‌ను సన్మానించిన మంత్రి వాకిటి శ్రీహరి

బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నికత్ జరీన్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో సన్మానించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కప్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నికత్ జరీన్ మర్యాద పూర్వకంగా మంత్రి వాకిటిని కలిశారు. ఈ సందర్బంగా భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాలని మంత్రి ఆకాంక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా ప్రోత్సాహక, విధానాలతో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసానిస్తుందన్నారు.



