ఆంధ్ర ప్రదేశ్

తిరుమల నుంచి తిరుచానూరుకు పంచమి సారె

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుండి కాలినడకన సారేను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర, జాకెట్ తో పాటు ప్రసాదాలను తిరుమల నుండి తిరుపతి మీదుగా తిరుచానూరుకు సారెను తీసుకువచ్చారు. సారె శోభాయాత్ర ఆధ్యాంతం, అత్యంత వైభవోపేతంగా సాగింది.తిరువీధుల గుండా సాగిన సారె శోభాయాత్ర తిరుచానూరుకు చేరింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, మంది మార్బలంతో తిరుచానూరు సమీపంలోని పసుపు మండపానికి తీసుకువచ్చారు.

పసుపు మండపం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం వేద పండితుల మంత్రోత్సంగం మధ్య సారెను అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు.ఆలయం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన పండితులు, ఆతర్వాత అక్కడినుంచి నేరుగా పద్మసరోవరం కు తీసుకువచ్చి చక్రతల్వార్లకు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకలు నిర్వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button