జాతియం
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు

Air Pollution: ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదువుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు.
రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నోయిడా ఏక్యూఐ 413కు చేరింది. ఘజియాబాద్‌లో 432 ఏక్యూఐ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవిస్తోంది. ఈ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలు మరింత క్షీణించే అవకాశం ఉంది . గ్రేటర్ నోయిదాలో 399 ఏక్యూఐ నమోదయ్యింది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది.



