Bhagyashri Borse: లవ్ మ్యారేజ్ ఖాయం

Bhagyashri Borse: ‘ఆంధ్ర కింగ్ తాలూకా ’ నటి భాగ్యశ్రీ బోర్సే తన పెళ్లి గురించి ఓపెన్ అయింది. కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా ’ నవంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే పెళ్లి విషయంపై ఓపెన్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటానని, అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని చెప్పినా, తనకు ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉందని తెలిపింది.
తనను అర్థం చేసుకునే వ్యక్తి తప్పకుండా జీవితంలోకి వస్తాడని, అప్పుడు లవ్ మ్యారేజ్ ఖాయమని నమ్మకంగా చెప్పింది. ఈ బోల్డ్, నిజాయితీ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్‌తో తొలి జోడీగా కనిపించబోతున్న భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తోంది.



