ఆంధ్ర ప్రదేశ్

Sachin Tendulkar: సత్యసాయిబాబా పుస్తకం పంపారు.. అది గోల్డెన్‌ మూమెంట్‌

Sachin Tendulkar: క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ సత్యసాయిబాబాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “సత్యసాయి బాబా పంపిన పుస్తకం నా జీవితంలో గోల్డెన్‌ మూమెంట్‌” అని అన్నారు. ప్రజలను ఎప్పుడూ జడ్జ్‌ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పిన మాటలు తనకు ఎన్నో సందర్భాల్లో మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు.

2011 వరల్డ్‌కప్ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో బాబా బెంగళూరులో ఉన్న తనకు ఫోన్‌ చేసినట్టు, తర్వాత ఒక పుస్తకం పంపించారని సచిన్ చెప్పారు. ఆ పుస్తకం తనలో సానుకూల దృక్పథం, కొత్త స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఆ సంవత్సరం భారత్ వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడం కూడా ఆ ఆశీర్వాదాల ఫలితమేనని సచిన్ భావోద్వేగంగా పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button