News

ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీకి అపూర్వ స్పందన

హైదరాబాద్, నవంబర్ 16: ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ (ICI) ఆధ్వర్యంలో హాంప్‌షైర్ ప్లాజా, హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీ విశేష విజయాన్ని నమోదు చేసుకుంది. దేశం నలుమూలల నుండి వచ్చిన సుమారు 150 మంది పాల్గొనగా, ఈ కార్యక్రమం అత్యంత ప్రభావవంతంగా, ప్రేరణాత్మకంగా సాగింది.

ఈ అకాడమీని స్థాపకులు డా. గంప నాగేశ్వరరావు, జాతీయ అధ్యక్షురాలు మాధవి కె., భూతపూర్వ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ సోను మార్గదర్శకత్వంలో, అలాగే ప్రతి NGC నాయకుని సక్రియ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించారు.

అద్భుతమైన ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ప్రతి నాయకుని చురుకైన పాల్గొనడం క్లబ్ అధ్యక్షుల నుండి విశేష ప్రశంసలను అందుకుంది. నాయకత్వ వికాసం, ఉత్తేజకరమైన సెషన్లు, సత్కారాలు, మరియు అందించిన అవకాశాలు మొత్తం వాతావరణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అకాడమీ క్లబ్‌ల మధ్య ఐక్యతను, లక్ష్యసాధన దిశలో ఉన్న కట్టుబాటును మరింత బలపరిచిందని పలువురు పాల్గొనేవారు అభినందించారు.

కార్యక్రమం జరిగిన హాంప్‌షైర్ ప్లాజా వేదిక అందరికీ నచ్చింది. అలాగే V.I.P సభ్యత్వ కార్యక్రమానికి లభించిన విశేష స్పందన ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డా. గంప నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా V.I.P మెడల్ అందుకోవడం సభ్యులందరికీ గర్వకారణంగా నిలిచింది.

ప్రెసిడెన్షియల్ అకాడమీ ఘనంగా ముగిసే సరికి, ICI భారతదేశవ్యాప్తంగా మరింత బలమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని మరోసారి ఋజువు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button