తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. అభ్యర్థి మృతి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కాగా మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్న క్రమంలో అన్వర్ మృతి చెందడం కలకలం రేపింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. ఒకవేళ మహమ్మద్ అన్వర్ జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మరోసారి ఎన్నిక రద్దు అవుతుంది.



