జాతియం
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలోని జైరామ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.



