జాతియం
PM Modi: ఆర్ఎస్ఎస్కు దేశమే ముఖ్యం

PM Modi: ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు తెలిపారు. అలాగే గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ అంటే విజయమని ఆర్ఎస్ఎస్కు దేశమే ముఖ్యమని, దేశానికి సేవ చేసేందుకు సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని, దేశమే ప్రథమం అనేది ఆర్ఎస్ఎస్ విధానమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించారు.



