తెలంగాణ

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్‌రెడ్డి

Telangana: తెలంగాణ నూతన డీజీపీ శివధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. స్థానిక ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధతతో ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాలనుంచి పోలీసులకు మద్దతు ఉండాలన్నారు. మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని నూతన డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. మావోయిస్టుల విధానం సక్సెస్ కాలేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తులను అవమానించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button