తెలంగాణ

సికింద్రాబాద్ మెడికవర్‌‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌లో మెడికవర్ హాస్పిటల్ నూతన బ్రాంచ్‌ను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న మెడి కవర్ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో అందుబాటులోకి రావడం సంతోషకరమని కిషన్ రెడ్డి అన్నారు. మనం తినే ఆహారం, నీరు, గాలి కాలుష్యమే రోగాలకు కారణమని కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఈ తరహా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని, మెడికవర్ వంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆ దిశగా ముఖ్యపాత్ర పోషిస్తాయని బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక ప్రజలు, వైద్యులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేతలు ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక విభాగాల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి మొదలైన ఈ కొత్త మెడికవర్ హాస్పిటల్, భవిష్యత్తులో మరెన్నో వైద్య సేవలను ప్రజలకు అందించనుందని వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button