ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. నిన్న మాత్రమే 70,472 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే, 25,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3.85 కోట్లుగా ఉంది.



