ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి సేవలో కీలక మార్పులు

టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవారి సేవకు సంబంధించి నూతన మాడ్యూల్ ని ప్రారంభించారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి సేవలో పలు సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. శ్రీవారి సేవకులకు ఐఐటీ అహ్మదాబాద్, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్విమ్స్, బర్డ్, అశ్వినీ ఆస్పత్రులలో రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.



