జాతియం
ఛత్తీస్‌ఘడ్ సుక్మాలో మహిళా మావోయిస్టు అరెస్ట్

ఛత్తీస్‌ఘడ్ సుక్మాలో 20 ఏళ్లుగా సక్సల్ సంస్థలో చురుగ్గా పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మద్వి సుక్కిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్వి సుక్కి అరెస్టును డీఆర్జీ బృందం పెద్ద విజయంగా చెబుతుంది. మద్వి సుక్కి తొండమార్కా అడవిలో పట్టుకున్నట్లు ప్రకటించారు.
మద్వి సుక్కి భయంకరమైన నక్సల్ కమాండర్‌గా మారిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో మోహరించిన భద్రతా దళాలపై మాద్వి సుక్కి IED పేల్చింది. ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధ చట్టం వంటి అనేక సెక్షన్ల కింద నేరం నమోదు చేశారు.



