జాతియం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం విచారణలో పురోగతి

Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాద బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. బ్లాక్ బాక్స్ డేటాను ఏఏఐబీ ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటాను ల్యాబ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దీంతో ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రమాద కారణాలను వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. ఇక భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఈ విశ్లేషణ ఉపయోగపడనుంది.