తెలంగాణ
రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతో ఫుట్‌బాల్

Revanth Reddy: శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మనవడు రియాన్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెస్సి బృందానికి ఏమాత్రం తగ్గకుండా స్టేడియంలో సందడి చేశారు. తాతకంటే ముందే తెలుపు, ఎరుపు జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చిన రియాన్షి, మెస్సితో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు.
సీఎం రేవంత్ మనవడిని దగ్గరకు తీసుకుని ఫుట్‌బాల్‌ను ఎలా కిక్ కొట్టాలో నేర్పించారు. కొద్దిసేపు మెస్సితో కలిసి ఆడిన రియాన్షి, అనంతరం అతనితో ఫొటో కూడా దిగాడు. ఈ దృశ్యాలు స్టేడియంలో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించాయి.



