జాతియం
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్

Karnataka: కర్ణాటకలో పదవుల పంచాయితీ కొనసాగుతుంది. సిద్దూ సీఎం కూర్చీపై డీకే నజర్ పడింది. కొద్ది రోజులుగా హస్తినలో లాబీయింగ్ జరుగుతుంది. కన్నడనాట పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శివకుమార్ పోస్ట్ వైరల్‌గా మారింది.



