తెలంగాణ
విషాదం.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క ..కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.మృతి చెందిన తమ్ముడికి అక్క రాఖీ కట్టిన ఘటన అక్కడికి వచ్చిన వారందరికీ కంటతడి పెట్టించింది.కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం రాఖీ పండుగ ఉండడంతో మృతి చెందిన తమ్ముడికు చివరిసారిగా అక్క జ్యోతి రాఖీ కట్టింది. జ్యోతి కి తమ్ముడు అప్పిరెడ్డి అంటే ఎంతో ఇష్టం.
ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున తప్పకుండా సోదరుడికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంటుంది. అయితే ఈసారి ఆమె రాఖీ కట్టే సమయానికి తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మృతి చెందిన తన తమ్ముడు అప్పిరెడ్డి కి రాఖీ కట్టి ఇదే నా చివరి రాఖీ చిన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.



