సినిమా

కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో కొత్త సినిమా?

కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకులుగా గుర్తింపు పొందిన కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్ ఈ ఏడాది దర్శకులుగా నిరాశపరిచారు. వారి చిత్రాలు అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ఇప్పుడు వీరు ఇద్దరూ కలిసి మరో అవకాశం సృష్టించుకుంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

తమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులుగా పేరు సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్ ఈ ఏడాది అంచనాలను అందుకోలేకపోయారు. కార్తీక్ సుబ్బరాజ్ ‘గేమ్ ఛేంజర్’కు కథ అందించగా ఆ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే సూర్య నటించిన ‘రెట్రో’ కూడా మిశ్రమ స్పందనతో ప్లాప్ అయింది. ఇక లోకేశ్ కనగరాజ్ రజనీకాంత్ ‘కూలీ’ భారీ అంచనాలు సృష్టించి, 500 కోట్ల మార్కును దాటినా కూడా, బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు.

ఈ ఫలితాలతో రజనీకాంత్ తన తదుపరి చిత్రం ‘తలైవర్ 173’ నుంచి లోకేశ్‌, కార్తీక్ ను తప్పించారు. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ నిర్మాతలుగా మళ్లీ అడుగుపెడుతున్నారు. లోకేశ్ జీ స్క్వాడ్, కార్తీక్ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ కలిసి ‘29’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రత్న కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విధు, ప్రీతి ఆస్రానీ కథానాయకులుగా నటిస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button