తెలంగాణ
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నార్సింగి, చందానగర్, కొల్లూరులో ఎస్వోటీ దాడులు చేపట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు.
బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగాల్‌కు చెందిన దాల్మియా, బర్మాను అధికారులు అరెస్ట్ చేశారు. చందానగర్‌లో MDMA విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరులో 42 కేజీల గంజాయి సీజ్ చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశారు.



