ఆంధ్ర ప్రదేశ్
ఏజెన్సీ వాసులకు తప్పని డోలీ మోతలు

ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వారి కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతుంది. వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీ ద్వారా తరలించారు.
నాగవలి నది దాటుకుంటూ అవతలి వైపుకి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.



