YS Jagan: 2027లో ప్రజా సంకల్పయాత్ర… ఎక్కడి నుంచి అంటే..?

YS Jagan: రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కుటుంబం.. ఒక్కరు కాదు…ఇద్దరు కాదు…ఏకంగా ముగ్గురు పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది…వైఎస్ పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే…జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం పై కూర్చో బెట్టింది…దీంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు అంట….2027లో ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి….గతంలో ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే సారి ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారో తెలుసా…..లెట్స్ వాట్ దిస్ స్టోరీ….
ఏపీలో అధికారం చేపట్టాలి అంటే ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం తప్పనిసరిగా మారింది. గత కొన్ని ఏళ్లుగా ఇదే ట్రెండ్ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతుంది. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎల్పీ నేతగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర మొదలు పెట్టారు.
2003 ఏప్రిల్ 9 న ప్రజా ప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన చేసిన పాదయాత్రకు ఉమ్మడి ఏపీ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.అంతేకాదు అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చో బెట్టింది.
ఇక వైఎస్ఆర్ మరణం తరువాత మారిన రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన వారసుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. అయితే జగన్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడంతో అప్పటి పాలకులు జగన్ మోహన్ రెడ్డిని జైలుకి పంపించారు. దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీనీ అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను జగన్ సోదరి షర్మిల భుజాన వేసుకున్నారు.
అందులో భాగంగా మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకు రాలేకపోయింది.ఇది ఇలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం టీడీపీ యువనేత లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీనీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదటిసారి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ 2017 నవంబర్ 6 ఇడుపులపాయలో పాదయాత్ర మొదలు పెట్టారు.
ఆ యాత్ర దాదాపు 341 రోజుల 3648 కిలో మీటర్లపాటు కొనసాగి,2019 జనవరి 9న ఇచ్చాపురంలోనే ముగిసింది. వైఎస్ఆర్ బాటలోనే జగన్ కూడా పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. జగన్ పాదయాత్రలో దాదాపు రెండు కోట్లమంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి బాధలు, సమస్యలు సావధానంగా విన్నారు. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చారు జగన్.
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాలకు కాను 134 నియోజక వర్గాలలో కొనసాగింది జగన్ యాత్ర. జగన్ పడిన కష్టం ఊరికే పోలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. ఏకంగా ఆ పార్టీ 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. అంతే కాదు జగన్ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మళ్ళీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు అంటూ చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే కావస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు.
అలాగే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 2029 లో జరగనున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు వైసీపీ నీ అధికారం లోకి తీసుకు వచ్చేందుకు మరోసారి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.
తనకు ఇంకా వయసు ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే సత్తా కూడా ఉందని మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తా అంటూ జగన్ గతంలోనే చెప్పారు. దీంతో జగన్ పాదయాత్ర 2027 మద్యలో ప్రారంభం అయ్యే చాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఈ సారి దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసే చాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.అంటే 2029 జనవరి నాటికి జగన్ పాదయాత్ర ముగిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జగన్ పాదయాత్ర ఎక్కడ మొదలు పెడతారు. రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి పార్టీ వర్గాలలో రక రకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయలో పాదయాత్ర మొదలు పెట్టారు. ఇచ్చాపురంలో ముగించారు. దీంతో ఈసారి కూడా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టే చాన్స్ ఉందని ప్రచారం ఒక వైపు జరుగుతుంది.
అలా చేస్తే రొటీన్ గా ఉంటుందని ఈసారి రాష్ట్రం నడిబొడ్డు నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుదనేది కొందరి నేతల అభిప్రాయం అంట. పాదయాత్ర నాటికి రెండు మూడు రూట్ మ్యాపులు అధినేత ముందు ఉంచేలా కసరత్తు జరుగుతుంది.
వీటిలో జగన్ ఏది ఫైనల్ చేస్తారో చూసిన తరువాత ఒక క్లారిటీ రానుంది. ఇక జగన్ ఎక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినా రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో దాదాపు 150 కి పైగా నియోజకవర్గాలు కవర్ చేయాలనే యోచనలో ఉన్నారట. పార్టీకి అత్యంత బలమైన నియోజక వర్గాలను పక్కన పెట్టినా మిగతా చోట్ల యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గత పాదయాత్రలో కవర్ కానీ నియోజక వర్గాల్లో మాత్రం ఈసారి తప్పకుండా జగన్ యాత్ర కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. పాదయాత్ర నాటికి ఈ ప్రజా అభిమానం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ పాదయాత్ర తరువాత వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఈసారి ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు వైసీపీ నేతలు.



