ఆంధ్ర ప్రదేశ్
నల్లమలలోని గుమ్మిత వాటర్‌ఫాల్ దగ్గర పులి సంచారం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమ్మితం సమీపం నల్లమల అటవీ ప్రాంతం వాటర్ ఫాల్ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్లిన పర్యాటకులకు పెద్దపులి అడుగుల జాడ కనిపించడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వాటర్ ఫాల్ ఉండటంతో పర్యాటకులు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు.
అయితే కొద్దిమంది యూత్ పులి అంటే భయం లేకుండా ఫారెస్ట్ సిబ్బంది కళ్లుగప్పి వాటర్‌ఫాల్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే కొద్దిమంది ఫారెస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుని యువకులను ఫారెస్ట్‌లోకి, వాటర్ఫాల్లోకి వెళ్లేందుకు తెరచాటుగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.



