తెలంగాణ

కూకట్‌పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

హైదరాబాద్ కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలోని మూలవిరాట్‌కు సంబంధించిన ఆభరణాలను చోరీ చేశారు దుండగులు. సుమారు 30 లక్షల రూపాయల పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ పూజారులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button