అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు

ప్రకాశం జిల్లాలోని గడ్డమీదపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తన కూతురు మరణానికి అత్త కుటుంబమే కారణమని భావిస్తూ అల్లుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చిన్నారావు తన కుమార్తెను సొంత బావమరిదికి ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్ని కారణాల వల్ల, వివాహమైన కొద్ది కాలంలోనే చిన్నారావు కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.
అప్పటి నుండి తరచూ రమణ కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగుతూ వచ్చాడు. అదే సమయంలో అత్త ఇంటికి వెళ్తున్న చిన్నారావు ఆవేశంతో అత్తపై కత్తితో మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో అత్త తీవ్రంగా గాయపడింది.
అత్తను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి చేసిన అనంతరం చిన్నారావు కూడా అక్కడే ఉన్న రాయితో స్వయంగా తనను తాను గాయపరుచుకొని గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.



